జూన్ 14వ తేదీన, అంతర్జాతీయ రక్త దాన దినోత్సవం సందర్బముగా భారత ప్రభుత్వం, దేశంలో రక్త దానం కోసం అత్యధికముగా టెక్నాలజీని మరియు సొషల్ మీడీయాను ఉపయోగిస్తున్న సంస్థలను గుర్తించి సన్మానించింది. నెల్లూరికి చెందిన సన్నారెడ్డి రమేష్ http://www.indianblooddonors.com సంస్థ తరపున అవార్డు అందుకొన్నారు. ఈ సంస్థను 2000 వ సంవత్సరములొ నాగపూరుకు చెందిన ఖుష్రూ పోచ ప్రారంభించారు. రమేష్ ఈ సంస్థకు 2002 నుండి ఉచితముగా టెక్నాలజీని అందిస్తున్నారు. ఈ సంస్థ రక్త దాతల వెబ్ సైటును మరియు కాల్ సెంటర్ను నిర్వహిస్తుంది. దేశంలోని ఏ ప్రధాన నగరంలోనైనా రక్త దాతల వివరాలు చిటికెలో తెలుసుకోవచ్చు. 07961907766 కు ఫొను చేసి నగర ఎస్టీడి కొడ్ ను, మరియు రక్త గ్రూపు వివరాలు ఇస్తే క్షణాల్లో రక్త దాతల వివరాలు అందుతాయి. స్మార్ట్ ఫొన్ ద్వారా కూడా ఇండియన్ బ్లడ్ డోనర్స్ ఆప్ ను ఉపయోగించి రక్త దాతల వివరాలు పొందవచ్చు. అదే రోజున ఈ సంస్థ ప్లేట్లెట్ల కోసం ఇంకొక హెల్ప్ లైన్ను ప్రారంభించింది. దెశంలో ఏ నగరంలో నైనా ప్లేట్లెట్ల దాతలు కావాలంటే 07961907767 కు ఫొన్ చేయవచ్చు. ఈ సంస్థ అందించే సేవలన్ని పూర్తిగా ఉచితం.
Congrats Brother
LikeLike