రంగనాయకునికి ఎంగిలి వస్త్రమా?
చాల ఎళ్ళ క్రితం ఒక మంచి మనసున్న దాత నెల్లూరు తల్పగిరి రంగనాయకుల స్వామికి ఒక పట్టు వస్త్రం నేయించి కానుకగా ఇవ్వాలనుకున్నడు. ఆ రోజులలో పట్టు నేసే వారికి ఒక అలవాటు ఉండేది (ఈ రోజులలో ఉందో లేదో నాకు తెలియదు). నేత మద్యలొ ఎక్కడైన పట్టు పోగులు తెగిపోతే వాటిని నోటి ఎంగిలి తడితో పురి వేసేవారు, మనము పుస్తకం పేజి/పుట తిప్పే ముందు వేలు నాలుకపై పెట్టినట్టు. అది చూసిన ఆ దాత ‘ ‘రంగనాయకునికి ఎంగిలి వస్త్రమా?’ అని ఎలాగైన ఆ అలవాటు మానిపించి నేయించాలనుకొన్నడు, కాని అది కుదరలేదు. అప్పుడు ఆయన ఆలోచించి ఒక బంగారు గిన్నె చేయించి దానిలొ నీళ్ళు పోసి, ఎవరైతే ఎంగిలి చేయకుండా ఈ గిన్నెలొ నీళ్ళతొ వేలు తడుపుకొని పురి పెట్టి నేస్తారో వారికి ఈ బంగారు గిన్నె (ఈ ఫొటొలొ ఉన్న బంగరు గిన్నెకి, ఆ దాత … Continue reading రంగనాయకునికి ఎంగిలి వస్త్రమా?