చాల ఎళ్ళ క్రితం ఒక మంచి మనసున్న దాత నెల్లూరు తల్పగిరి రంగనాయకుల స్వామికి ఒక పట్టు వస్త్రం నేయించి కానుకగా ఇవ్వాలనుకున్నడు. ఆ రోజులలో పట్టు నేసే వారికి ఒక అలవాటు ఉండేది (ఈ రోజులలో ఉందో లేదో నాకు తెలియదు). నేత మద్యలొ ఎక్కడైన పట్టు పోగులు తెగిపోతే వాటిని నోటి ఎంగిలి తడితో పురి వేసేవారు, మనము పుస్తకం పేజి/పుట తిప్పే ముందు వేలు నాలుకపై పెట్టినట్టు. అది చూసిన ఆ దాత ‘ ‘రంగనాయకునికి ఎంగిలి వస్త్రమా?’ అని ఎలాగైన ఆ అలవాటు మానిపించి నేయించాలనుకొన్నడు, కాని అది కుదరలేదు.
అప్పుడు ఆయన ఆలోచించి ఒక బంగారు గిన్నె చేయించి దానిలొ నీళ్ళు పోసి, ఎవరైతే ఎంగిలి చేయకుండా ఈ గిన్నెలొ నీళ్ళతొ వేలు తడుపుకొని పురి పెట్టి నేస్తారో వారికి ఈ బంగారు గిన్నె (ఈ ఫొటొలొ ఉన్న బంగరు గిన్నెకి, ఆ దాత ఇచ్చిన గిన్నెకి సంబంధం లేదు.) కానుకగా ఇస్తాను అన్నాడు. పొరపాటున ఒక్కసారైన ఎంగిలి చెస్తే పట్టు బట్టను తీసుకోను అన్నాడు. ఇప్పుడు నేసే వారి తిప్పలు చూడాలి, ఒక పక్క ఏళ్ళనుంచి వచ్చిన అలవాటు, ఒక పక్క బంగరు గిన్నె. ఒక్కసారి ఎంగిలి చెస్తే అప్పటివరకు పడ్డ శ్రమంతా దండగ, మళ్ళీ కొత్త బట్టతొ మొదలు పెట్టలి.
మొత్తనికి ఎవరొ ఎంగిలి చెయకుండా పట్టు బట్టని నేసి ఇచ్చారు. ఆ దాత వారికి ఆ బంగారు గిన్నెను కనుకగ ఇచ్చి, ఆ పట్టు బట్టని స్వామివారికి సభక్తికంగా సమర్పించుకొన్నారుమీకు ఆ దాత గురించి తెలిసినా, నేసిన వారు గురించి తెలిసినా, బంగారు గిన్నె గురించి తెలిసినా, పట్టు వస్త్రం గురించి తెలిసినా నాకు దయచేసి చెప్పండి.
-నెల్లూరోడు